ఆన్లైన్ పదోన్నతులు బదిలీలతో….ఉన్నత పాఠశాలల్లో భారీగా కాలేజీలు

– ఆన్లైన్ పదోన్నతులు బదిలీలు తో….ఉన్నత పాఠశాలల్లో భారీగా కాలేజీలు…
– ఆందోళనలో విద్యార్దులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ ఆన్లైన్ పదోన్నతులు,బదిలీలు తో అనేక పాఠశాలల్లో భారీగా కాలీ పోస్ట్ లు ఏర్పడ్డాయి. పదోన్నతులు కోసం పాఠశాలలో విద్యార్ధులు సంఖ్య తెలియకుండా ఉపాధ్యాయ ఖాలీ లు చూపించడం,ఒకే ఉపాధ్యాయుడి కీ రెండు మూడు సబ్జెక్టుల్లో పదోన్నతి కి అవకాశం ఇవ్వడంతో వెబ్ ఆప్షన్ ప్రకారం ఉపాద్యాయులు పాఠశాలలను,పోస్టులకు ఎంచుకోవడంతో ఈ చిక్కంతా వచ్చిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ ఖాళీలను ఎపుడు నింపుతారో ,నింపడానికి అయిన ఆ ఖాలీ లకు అర్హులైన ఉపాద్యాయులు ఉన్నారో లేదో అనే అనిశ్ఛితి ఏర్పడి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహారణ కు అశ్వారావుపేట మండలంలో ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నవి.వీటిలో ఉండాల్సిన ఉపాద్యాయ పోస్టులకు నేడు భర్తీ అయిన పోస్టులకు పొంతన లేకుండా పోయింది.

పాఠశాల          పోస్ట్ లు          ఉన్నవి       ఖాళీలు
అ.పేట(బి)         21               15              6
అ.పేట(జి)         27               10              7
అ.పురం            7                 7               7
ఎం.వి.గూడెం     9                 6               3
నా.పురం           8                 3               5
గుమ్మడవల్లి        7                 2               5
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలపాలంటే యూనిఫాం,మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పిస్తే నే సరిపోదు ఆ మేరకు బోధన సైతం విద్యార్ధులకు అందాలి.ఉత్తమ ఫలితాలు పొందాలంటే బడిలో సౌకర్యాలతో పాటు సరిపడా ఉపాద్యాయులు ఉంటేనే సాధ్యం అవుతుంది.