డాక్టర్ కొండపల్లి నీహారిణి కథల సంపుటి ‘ఘర్షణ’ ఆవిష్కరణ సభ ఈ నెల 22 శుక్రవారం సాయంత్రం 6గం||కు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ రచయితల సంఘం, పాలపిట బుక్స్ సంయుక్త ఆధ్వర్యంలో, కందుకూరి శ్రీరాములు అధ్యక్షతన నందిని సిధారెడ్డి పుస్తకావిష్కరణ చేయనున్నారు. కార్యక్రమం లో మంత్రి శ్రీదేవి, తాటిపాముల మత్యుంజయుడు, శీలా సుభద్రాదేవి, నెల్లుట్ల రమాదేవి, వాణి దేవులపల్లి, బెల్లంకొండ సంపత్ కుమార్ ప్రసంగిస్తారు.