ప్రజాకవి కాళోజీ నారాయణరావును ఆదర్శంగా తీసుకుందామని జన్నారం మండల ప్రత్యేక అధికారి కిషన్, ఎంపీడీఓ శశికళ, తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి అన్నారు. కాలోజీ జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాష ప్రాముఖ్యతను పెంచిన మహాకవి కాలోజీ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.