కొలంబియా సంచలనం సెమీస్‌ల్‌లో ఉరుగ్వేకు ఝలక్‌

Colombia shocks Uruguay in the semis– కోపా అమెరికా టైటిల్‌ పోరులో అర్జెంటీనాతో ఢీ
ఈస్ట్‌ రూథర్‌ఫర్డ్‌(అమెరికా): కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్లోకి కొలంబియా ప్రవేశించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత రెండోసెమీస్‌లో కొలంబియా జట్టు 1-0తో పటిష్ట ఉరుగ్వేను చిత్తుచేసింది. కొలంబియా తర ఫున ఏకైక గోల్‌ను జెఫర్సన్‌(39వ ని.)లో చేశాడు. 46వ నిమిషంలో డార్విన్‌ నూనెజ్‌ రెండుసార్లు పసుపుకార్డుకు గురయ్యాడు. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ క్రమంలో కొలంబియా జట్టు రెండో అర్ధభాగమంతా 10మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. అయినా కొలం బియా డిఫెన్స్‌ అద్భుతంగా ఉండడంతో ఉరుగ్వే గోల్‌ కొట్టలేకపోయింది. 2001 తర్వాత కొలంబియా జట్టు కోపా అమెరికా టైటిల్‌ పోరుకు చేరడం ఇదే ప్రథమం. ఉరుగ్వే జట్టు క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో చిత్తుచేసి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో కొలంబియా జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది.