కల్నల్‌ సంతోష్‌ బాబు త్యాగం చిరస్మరణీయం

– మంత్రి జగదీశ్‌ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కల్నల్‌ సంతోష్‌ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని రాష్ట్ర విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. కల్నల్‌ సంతోష్‌ బాబు మూడో వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక కోర్టు చొరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూల మాల వేసి మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన సంతోష్‌ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయాకంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌,గ్రంథాలయ జిల్లా చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌,మున్సిపల్‌ చైర్మెన్‌ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
మజ్జిగ పంపిణీ
చైనా ముష్కర్ల దాడిలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు మూడవ వర్థంతి సందర్భంగా గురువారం స్థానిక కోర్టు చౌరస్తా(సంతోష్‌ బాబు చౌరస్తా) వద్ద గల సంతోష్‌ బాబు విగ్రహం వద్ద ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మీకాంత్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి పాల్గొని బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, కల్నల్‌ సంతోష్‌ బాబు సతీమణి సంతోషి, తల్లిదండ్రులు బిక్కుమళ్ళ వెంకటేశ్వర్లు, మంజుల, పట్టణ ప్రముఖులు,వైశ్య ఫెడరేషన్‌ నాయకులు, వాసవి క్లబ్‌ సభ్యులు,సుమన్‌ యువ సేన సభ్యులు పాల్గొన్నారు.