– ప్రతి మహిళ “సక్సెస్ క్రియేటర్” కావాలి
– భారతీయ స్త్రీలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం
– కందుల సంధ్యారాణి, రామగుండం బీజేపీ మహిళా నాయకురాలు
నవతెలంగాణ– గోదావరిఖని
మహిళ మహా శక్తి స్వరూపిణీ అని రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారీ శక్తివందన్ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ చేశారు. వందల సంఖ్యలో పాల్గొన్న మహిళలతో కలిసి మోడీ వాఖ్యానం శ్రద్ధగా గమనించారు. అనంతరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలను కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ.. ప్రపంచంలో సగభాగానికి పైగా మహిళలే ఉన్నారని, ఎన్నోరంగాల్లో ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. మారుతున్న కాలనికి అనుకూలంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థ భాగమైన మహిళలు సమానత్వం కోసం మగవారితో పోటిపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ప్రధాని మోదీ.. మహిళా సంఘాలకు రుణ సౌకర్యం, మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు పరుస్తున్న తీరును క్షేత్రస్థాయిలో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ “సక్సెస్ క్రియేటర్” కావాలని పిలుపునిచ్చారు. భారతీయ స్త్రీలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. వేడుకలలో మహిళలు వివిధ “ఫన్ గేమ్స్”లలో గెలుపొంది బహుమతులను గెలుచుకున్నారు. ఫ్యాషన్ షోలో తమ వస్త్రధారణతో పలువురిని ఆకట్టుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా చీరకట్టు, బొట్టు, నడక, నడవడిక విధానంతో కార్యక్రమాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మెరుగు హనుమంతు గౌడ్, వడ్డేపల్లి రాంచందర్, పెద్దపల్లి రవీందర్, చంద్రశేఖర్, తోట కుమారస్వామి, బొడకుంట జనార్ధన్.. బాణాల స్వామి, కొమ్మల స్వామి, రవి చరణ్, మహావాది రామన్న, నవీన్ గౌడ్, పైతరి రాజు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు