– తెలంగాణ అమరవీరుల స్మారకార్థం ఈనెల11 నుండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్స్
– గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే పోటీలు
– దమ్మోజు సతీష్ కుమార్, పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు, అచ్చంపేట
నవతెలంగాణ – అచ్చంపేట రూరల్
తెలంగాణ అమరవీరుల స్మారకార్థం, గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పబ్లిక్ క్లబ్, అచ్చంపేట ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో పబ్లిక్ క్లబ్ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలోని సింథటిక్ వుడెన్ కోర్టులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నామని పబ్లిక్ క్లబ్ అద్యక్షులు దమ్మొజు సతీష్ కుమార్ ఆదివారం నాడు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పబ్లిక్ క్లబ్ అచ్చంపేట ఆధ్వర్యంలో అచ్చంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ గార్లపాటి శ్రీనివాసులు, గార్లపాటి సుదర్శన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆర్థిక సహకారంతో ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను జనవరి 11 నుంచి జనవరి 14 వరకు నిర్వహించబడునని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు జనవరి 9 సాయంత్రం 5 గంటలలోపు 600 రూపాయలు ఎంట్రీ పేజీ చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోగలరని తెలిపారు. జనవరి 10న ఐదు గంటల 30 నిమిషాలకు క్లబ్బు ఆవరణలో డ్రా తీయబడును అని, పోటీలు పబ్లిక్ క్లబ్ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలోని సింథటిక్ వుడెన్ కోర్టుపై, డబుల్స్ నాకౌట్ పద్ధతిన నిర్వహించబడునని తెలిపారు. ప్రతి ప్లేయర్ నాన్ మార్కింగ్ షూ మాత్రమే ధరించి ఆడవలసి ఉంటుందని, మావిస్ 350 షటిల్ కాక్స్ తో నిర్వహించబడునని తెలిపారు. క్రీడాకారులు తమ జట్టులోని ఇద్దరు పేర్లను, ఫోన్ నెంబర్లను ఇచ్చి నమోదు చేసుకోవాలని, క్రీడాకారులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులై ఉండవలెనని తెలిపారు. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు నగదు మరియు జ్ఞాపిక, ద్వితీయ బహుమతిగా 20 వేల రూపాయలు నగదు మరియు జ్ఞాపిక, తృతీయ బహుమతిగా పదివేల రూపాయల నగదు మరియు జ్ఞాపిక, నాలుగవ బహుమతిగా 5000 రూపాయలు మరియు జ్ఞాపిక ఇవ్వబడునని తెలిపారు. నమోదు చేసుకోవాల్సిన క్రీడాకారులు జి. వసంత్ కుమార్ యాదవ్ 9908715147, జే. కరుణాకర్ 9059779128, లక్ష్మణ్ 8317645336 లను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా క్లబ్బు సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులతో కలిసి బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్బు ప్రధాన కార్యదర్శి జై శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.