కలలోనన్నా వచ్చి పో

పోత పోత నాయనా ఇంటి బాధ్యత నంతా
నా గుండెకు సిలలా కొట్టి పోయిండు
ఒక్కొక్కసారి దాన్ని పట్టుకొని వేలాడుతుంటే కొంచెం బాధ అయితుంది
ఐదేళ్లు ఒక్క తీరుగా ఉండయని చెప్పి
నా కంటి నిండా నీళ్లు నింపి పోయిండు
అందరికీ తెలివి ఉండదు బిడ్డ కలుపుకుపోవాలనే టోడు
ఎంత కలుపుతున్న విచ్చళ్ళ చేస్తుర్రు గాని
ఒక్క పిండి అయి రొట్టె అయితలేదు
నలుగురు నాలుగు మాటలు అయినప్పుడు చెవిన పెట్టినట్టే ఉంటది
తర్వాత దురిపేసుకుంటరు నాతోని అయితలేదు నాయనా
నువ్వే ఒక్కసారి వచ్చిపో ఏమన్నా చెప్పిపో
నీ భయం లేకుండా పోయింది
నువ్వు లేవుగా అమ్మ కూడా లేదుగా ఎట్ల చేయాలనో ఏమో
పెత్తరమాస దినాలలో చెబుదామనుకొని
నువ్వు రాగానే సంతోషంలో అన్ని మర్చిపోయిన
కొంచెం కలలోనన్నా వచ్చి ఒక్క మాట చెప్పి పోరాదు
– గుండెల్లి ఇస్తారి, 9849983874