పరీక్ష కోసం వచ్చి..ప్రాణాలు విడిచి

–  ఆయాసం, బీపీ ఎక్కువై.. కుప్పకూలిన 8 నెలల నిండు గర్భిణి
– ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
– ఇస్నాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఘటన
నవతెలంగాణ-పటాన్‌చెరు
టెట్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ ఎనిమిది నెలల నిండు గర్భిణి.. పరీక్షా హాల్‌లోకి వెళ్లే తొందరపాటులో మెట్లు ఎక్కుతూ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌కు చెందిన బంటు రాధిక(32) టెట్‌ పరీక్ష రాయడం కోసం భర్త అరుణ్‌తో కలిసి పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలకు వచ్చింది. ఉదయం 9 గంటలకు సెంటర్‌కు చేరుకున్న ఆమె.. రెండో అంతస్తులోని పరీక్ష హాల్‌కు మెట్ల వైపుగా వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి కాగా.. మొదటి అంతస్తుకు చేరుకునేసరికి కొంత ఆయాసంతో బీపీ ఎక్కువై, చెమటతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
వెంటనే అక్కడున్న వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఆమె భర్త అరుణ్‌ హుటాహుటిన కారులో ముత్తంగిలోని ప్రణం ఆస్పత్రికి.. అక్కడి నుంచి పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధృవీకరించారు. మృతురాలికి రెండేండ్లు, నాలుగేండ్లు ఉన్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య మృతితో భర్త అరుణ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో పరీక్షాకేంద్రంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.