చలో అమెరికా

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ కోసం అగ్రెసివ్‌ ప్రమోషన్స్‌ చేస్తున్నారు హీరో నవీన్‌ పోలిశెట్టి. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్‌ టూర్‌ కంప్లీట్‌ చేసిన ఆయన అమెరికా వెళ్తున్నారు. డల్లాస్‌లో ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రీమియర్‌ షోస్‌ని ఆయన ఆడియెన్స్‌తో కలిసి చూడ బోతున్నారు.
ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్‌, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో ప్రమోషన్స్‌ నిర్వహిస్తారని మేకర్స్‌ తెలిపారు. నవీన్‌ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.