అహ్మదాబాద్ : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హైదరాబాద్‌కు రావాల్సిందిగా హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఆహ్వానించారు. హెచ్‌సీఏ లీగ్ పోటీలకు దాదా వస్తే.. యువ క్రికెటర్లకు ప్రేరణగా ఉంటుందని ఆయనతో చెప్పారు. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీతో జగన్‌మోహన్ రావు భేటీ అయ్యారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్దికి సహకారం అందించాలని గంగూలీని జగన్ కోరారు.