నవతెలంగాణ – వేములవాడ రూరల్
ఈనెల 8న జరిగే మహాశివరాత్రి జాతర పర్వదినానికి రావాల్సిందిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు.
జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రిని కలిసిన ఆది ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు కూడా ఆది శ్రీనివాస్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. వారి వెంట ఆలయ ఏ ఈ ఓ బ్రాహ్మణ గారు శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్ ఉన్నారు.