ఉద్యమ వీరునికి ఊరు రా జోహార్లు

నవతెలంగాణ – గోవిందరావుపేట
గుండెపోటుతో మృతి చెందిన జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ కు మండల వ్యాప్తంగా ఆదివారం ప్రతి గ్రామంలోనూ జోహార్లు పలికారు. చల్వాయి పసరా గోవిందరావుపేట మచ్చాపురం 163 వ జాతీయ రహదారి వెంట కుసుమ జగదీష్ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పూలదండలు వేసి అశ్రు నయనాల మధ్య నీరాజనాలు పలికారు. ఉద్యమ వీరుడు జోహార్లు జోహార్లు అంటూ ప్రజలు నినదించారు.ఉదయం పూట జగదీష్ మరణ వార్త దావనంలా వ్యాపించడంతో ప్రజల్లో నిస్సహాయత చోటుచేసుకుంది. దుఃఖ పూరిత వదనాలతో అన్న వార్త నిజమేనా నమ్మాలా వద్ద అన్న సందిగ్ధంలో చాలాసేపు కొట్టుమిట్టాడారు. మండల ప్రజానీకంతో జగదీష్ అన్నకు ఉన్న సంబంధాలు సాధారణమైనవి కావు. వార్త వినగానే భారీ ఎత్తున కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు రాజకీయాలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో జగదీష్ అన్నను కడసారి చూసేందుకు మల్లం పెళ్లికి భారీగా తరలి వెళ్లి చూసి నివాళులు అర్పించి వచ్చారు.