బాహుబలి కామిక్స్ నుండి ఆర్చీ కామిక్స్ వరకు కొత్త యాప్ ప్రపంచ, భారతీయ వెబ్‌టూన్ కంటెంట్, క్రియేటర్ల యొక్క అతిపెద్ద లైబ్రరీని లక్షలాది మంది భారతీయ వినోద అభిమానులకు చేరువ చేస్తుంది. వెబ్‌టూన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్నాయి , 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా US$60 బిలియన్లకు ఇది వృద్ధి చెందుతుందని అంచనా.
నవతెలంగాణ బెంగళూరు: టూన్‌సూత్ర ( Toonsutra) దేశంలోనే అతిపెద్ద వెబ్‌టూన్ యాప్‌ను ప్రారంభించింది, దీనిని భారతీయ వినియోగదారులందరూ Android & iOS పై యాక్సెస్ చేయవచ్చు మరియు ఆస్వాదించవచ్చు. వెబ్‌టూన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్నాయి , 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా US$60 బిలియన్లకు ఇది వృద్ధి చెందుతుందని అంచనా. దేశంలోని ప్రముఖ ఒరిజినల్ క్యారెక్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ గ్రాఫిక్ ఇండియా నుండి డిజిటల్ మీడియా స్టార్టప్ గత సంవత్సరం ప్రారంభించబడింది. భారతీయ వెబ్‌టూన్ మార్కెట్‌కు ఈ అవకాశం అందించే సమయాన్ని, సామర్థ్యాన్ని ధృవీకరిస్తూ, Sony ఇన్నోవేషన్ ఫండ్ ఇటీవల టూన్‌సూత్రలో పెట్టుబడిదారుగా మారింది. టూన్‌సూత్ర యాప్ ద్వారా, కామిక్ అభిమానులు కొన్ని ఉత్తమ గ్లోబల్ మరియు లోకల్ కామిక్ కంటెంట్ మరియు స్టోరీలను హిందీ, తమిళం, తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో మొబైల్ కోసం అనుకూలీకరించిన, సులభంగా చదవగలిగే ఫార్మాట్‌లో చూడవచ్చు. బెంగాలీ, మరాఠీ, మలయాళం, కన్నడ భాషలలో కూడా కంటెంట్ త్వరలో అందుబాటులో ఉంటుంది.
“భారతదేశం అంతటా లక్షలాది మందిని ఒకే చోటకు చేరుస్తూ పాప్-కల్చర్ వినోదం యొక్క కొత్త వేవ్‌నుప్రారంభించాలని టూన్‌సూత్ర యోచిస్తోంది మరియు కామిక్స్, వెబ్‌టూన్‌లు, యానిమేషన్, జానర్, ఫిక్షన్ అంతటా అభిమానుల యొక్క అతిపెద్ద కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యంగా చేసుకుంది ” అని గ్రాఫిక్ ఇండియా సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శరద్ దేవరాజన్ అన్నారు. “ స్ట్రీమింగ్ వీడియో విప్లవంతో మనం చూసినట్లే, భారతదేశ వినోద ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల అత్యుత్తమ కంటెంట్‌ను అనుభవించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు మరియు స్వదేశీ సృష్టికర్తల నుండి అద్భుతమైన స్థానిక ఒరిజినల్‌లను కూడా పొందవచ్చు. కామిక్స్, వెబ్‌టూన్‌లు దేశానికి తదుపరి పెద్ద దృశ్యమాన కథన మాధ్యమం గా నిలవనున్నాయి మరియు టూన్‌సూత్ర గొప్ప గ్లోబల్ క్రియేటర్‌లచే అత్యధిక నాణ్యత గల కామిక్ కథలను భారతదేశపు మాతృభాషలో మొదటిసారిగా తీసుకువస్తోంది. ” అని అన్నారు.

ఈ యాప్ ఫాంటసీ, రొమాన్స్, మైథాలజీ, సూపర్ హీరో, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, మరిన్నింటితో సహా వివిధ జెనెర్స్ నుండి ఎపిసోడ్‌లను అందిస్తుంది. టూన్‌సూత్ర యొక్క కొత్త స్టోరీ టెల్లింగ్ హోమ్ అత్యుత్తమ నాణ్యత గల వెబ్-టూన్, ప్రముఖ భారతీయ, గ్లోబల్ సృష్టికర్తల నుండి కామిక్ కథనాలను ప్రదర్శిస్తుంది. ఇందులో ఐకాన్‌లు స్టాన్ లీ, గ్రాంట్ మోరిసన్, ర్యాన్ పేజిలో, శేఖర్ కపూర్, జీవన్ జె. కాంగ్, మౌనికా టాటా, రోహన్ చక్రవర్తి, అలీసియా సౌజా కథలు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ భారతదేశం అంతటా అభివృద్ధి చెందుతున్న స్టార్ క్రియేటర్‌లను ప్రోత్సహిస్తుంది.
“వెబ్-టూన్ మొబైల్ కామిక్ స్పేస్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. 2030 నాటికి US$60 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశపు 700 మిలియన్ల భారీ యువ మార్కెట్ కొత్త, ఆకర్షణీయమైన, అధిక-నాణ్యత అనుభవాల కోసం వెతుకుతోంది. టూన్‌సూత్ర యొక్క వెబ్-టూన్ బైట్-సైజ్ ఫార్మాట్ ఈ రోజు వినోదాన్ని చాలా భిన్నంగా వినియోగించే ఈ యువ వినియోగదారుని ఆకర్షిస్తుంది” అని టూన్‌సూత్ర సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విశాల్ ఆనంద్ అన్నారు. “భారతదేశం యొక్క మీడియా, వినోద మార్కెట్ 2030 నాటికి $23 బిలియన్ల నుండి $100 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడినందున, వెబ్-టూన్ కామిక్స్ ఆ వృద్ధికి అతిపెద్ద యాక్సిలెరెంట్‌లలో ఒకటిగా నిలుస్తుందని మేము విశ్వసిస్తున్నాము,” అని అన్నారాయన.
పాఠకులు వెబ్‌టూన్‌లలోకి లోతుగా వెళ్లిపోతే, వారు నాణేలను సంపాదిస్తారు, రివార్డ్‌లను అన్‌లాక్ చేస్తారు మరియు ఆశ్చర్య పరిచే బోనస్ లను సైతం పొందుతారు. వారు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ పారితోషికం పొందుతారు, దానితో పాటు వారి కథా ప్రయాణంలో ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఇతర సాధారణ కామిక్ రీడర్ PDF యాప్‌ల వలె కాకుండా పేజీలను విభిన్న రూపాలలో ఆస్వాదించవచ్చు. ఉచిత రోజువారీ కంటెంట్‌తో పాటు, అభిమానులు INR 5 కంటే తక్కువ ధరకు ఎపిసోడ్‌లను కొనుగోలు చేయవచ్చు. టూన్‌సూత్ర లో అందుబాటులో విస్తారమైన లైబ్రరీ ఉంది, వీటిలో గ్రాఫిక్ ఇండియా యొక్క ప్రముఖ భారతీయ కామిక్ కథలతో పాటుగా దేశీయ, అంతర్జాతీయ క్రియేటర్స్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. టూన్‌సూత్ర గురించి మరింత తెలుసుకోవడానికి, www.toonsutra.comని సందర్శించండి. Android, iOS పరికరాలలో టూన్‌సూత్ర యాప్ ఉచితం గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.