
భిక్కనూరు మండలంలో 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని మండల పశువైద్యాధికారి దేవేందర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో ప్రతి గ్రామంలో పశుగణన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రతి కుటుంబంలో ఎన్ని పశువుల సంపద ఏ రకం పశుసంపద ఉంది అనే విషయాన్ని అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఈ పశుగణన ఆధారంగా భారతదేశంలో పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పథకాలు రూపొందించడంలో కీలకపాత్ర ఉంటుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు వస్తున్న సమయంలో అధికారులకు సహకరించి పశువుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమెటర్స్ సురేష్, మహేష్ గౌడ్, కృష్ణ, అనిత, సందీప్, భరత్, తదితరులు ఉన్నారు.