నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కన వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేయగా కేశవపట్నం గ్రామ ఆంజనేయస్వామి వ్యవస్థాపక అధ్యక్షులు పారిశ్రామికవేత్త, తనుకు ఓంకారం టెంకాయ కొట్టి ప్రారంభించి, దాహార్తులకు నీటిని, మజ్జిగ అందించారు. ఈ చలివేంద్రం ఏర్పాటు పట్ల వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్తక వ్యాపార సంఘం గౌరవ అధ్యక్షుడు గజ్జల్లి హనుమంతు, ఉపాధ్యక్షుడు బొంగోని శ్రీనివాస్ అఖిల్, సభ్యులు గుర్రం శ్రీనివాస్, వడ్నాల వెంకటేశ్వర్లు, వంగ శ్రీనివాస్ సామిల్, తుమ్మ సుధాకర్, కూచన శ్రీనివాస్, వంగ సత్యనారాయణ, వంగ బిక్షపతి సురేష్, బొంగోని సాంబమూర్తి, మాజీ ఎంపీటీసీ గుర్రం రామస్వామి, మాజీ సర్పంచ్ రాజ కొమురయ్య, మాజీ వార్డ్ మెంబర్ ములంగూరి సదానందం, పిల్లి సమ్మయ్య, నేలం వీరస్వామి సీనియర్ నాయకులు జునువాల రాజమల్లు, బండారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.