
– భారీగా తరలి వచ్చిన భక్తులు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం కోదండరామస్వామి ఆలయం లో మంగళవారం కన్నుల పండుగగా ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.నేటి మంగళవారం ఉదయం అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన మహా పూర్ణాహుతి కార్యక్రమానికి మాజీ జెడ్ పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి హాజరై ప్రత్యేక పూజులు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.ఈ ఉత్సవాలకు పెద్దవూర గ్రామానికి చెందిన కర్నాటి పాపిరెడ్డి, అరుణ దంపలు సొంత ఖర్చులతో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ, గ్రామస్థులు మాజీ జెడ్ పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డిని, మహాఅన్నదాన కార్యక్రమ దాత కర్నాటి పాపిరెడ్డి, అరుణ దంపతులను ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కర్నాటి నర్సింహమ్మా రెడ్డీ, మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పగడాల నాగరాజు, మండలయూత్ అధ్యక్షులు కిలారి మురళి కృష్ణ యాదవ్, కర్నాటి మధు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.