ముత్యాలమ్మ దేవత జాతర ప్రారంభం

– దైవాన్ని సందర్శించిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట 
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని మూడో మేజర్ పంచాయితీ అయిన వినాయకపురం లో చిలుకలు గండి ముత్యాలమ్మ జాతర వేద మంత్రోచ్చారణల నడుమ భక్తిప్రపత్తులతో శనివారం దేవాలయం నిర్వాహకులు ప్రారంభించారు. ఈ రోజు నుండి 5 రోజులపాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవానికి జిల్లా లోని అనేక మండలాలు తో పాటు, సరిహద్దు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో దైవాన్ని దర్శించుకుంటారు. మొదటి రోజైన శనివారం తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ దైవాన్ని సందర్శించి పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు.సీఐ జితేందర్ రెడ్డి,ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ శ్రీరాముల శ్రీను,అదనపు ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ లు బందోబస్తు ను పర్యవేక్షించారు.