ఐఐటీ గౌహతి లో ఆనర్స్ డిగ్రీ ప్రారంభం

Coursera - IIT G Degreeనవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని #7 top engineering institute ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్‌లలో ఒకటైన Bachelor of Science (Hons) Degree Program in Data Science and Artificial Intelligence on Coursera ప్లాట్‌ఫారమ్‌పై ప్రారంభిస్తోంది. ఈ ఆన్‌లైన్ డిగ్రీ డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విద్యార్థులకు అధిక-చెల్లింపు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉపాధి అవకాశాల కోసం సిద్ధం చేస్తుంది. ఆయా ఉద్యోగాలు మరియు పరిశ్రమలలో డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు కీలకంగా మారగా, మెరుగైన డిజిటల్ యాక్సెస్ మరియు ఉత్పాదక ఏఐను ప్రతి ఒక్కరూ వేగంగా అలవర్చుకుంటున్నారు. జాతీయ విద్యా విధానం- 2020 యువతకు ఉపాధిని మెరుగుపరచేందుకు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిసిస్ మొదలైన అత్యాధునిక రంగాలలో నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వడం, వారిని సిద్ధం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ విద్యావిధానం- 2020 ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని పెంచే ప్రాముఖ్యతను మరింత తెలియజేస్తుంది. World Economic Forum’s Future of Jobs Report 2023ప్రకారం, ఏఐ మరియు మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు మరియు డేటా సైంటిస్టులతో సహా టెక్ ఉద్యోగాలు 2028 నాటికి 30% కన్నా ఎక్కువ పెరుగుతాయని అంచనా. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు మరియు జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సులను అమలు చేసేందుకు ఐఐటి గౌహతి బహుళ ప్రవేశ మార్గాల ద్వారా పూర్తిగా ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు అందుబాటును కల్పిస్తోంది. గణితాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా కలిగి పన్నెండవ (XII) తరగతి తర్వాత లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్‌కు (ఏ సంవత్సరంలోనైనా) అర్హత మరియు నమోదు చేసుకున్నవారు నేరుగా ప్రవేశం పొందుతారు. అదే విధంగా ఆన్‌లైన్ కోర్సును పూర్తి చేసి వారి పనితీరు ఆధారంగా ప్రవేశాన్ని పొందవచ్చు. బహుళ నిష్క్రమణ ఎంపికలతో డిగ్రీ మొత్తం పూరక్తి చేయడం రివార్డు. విద్యార్థులు తమ క్రెడిట్లను సర్టిఫికేట్, డిప్లమా, డిగ్రీ మరియు చివరికి హానరరీ డిగ్రీగా మార్చడం ద్వారా ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించవచ్చు. ఫ్లెక్లిబిలిటీ మరియు ఎంగేజ్‌మెంట్‌ను పెంచేందుకు, ఆన్‌లైన్ కోర్సులు ప్రాథమికంగా అసమకాలికమైనవి కావడంతో విద్యార్థులు వారి స్వంత వేగంతో నేర్చుకునేలా చేస్తాయి. అయితే ఐచ్ఛిక క్యాంపస్ సందర్శనలు అనేవి అధ్యాపకులు మరియు సహచరులతో నిమగ్నమయ్యే అవకాశాలను అందిస్తాయి. జనరేటివ్ ఏఐ, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ మరియు డేటా మైనింగ్‌తో సహా ప్రత్యేకమైన సబ్జెక్టులను అధ్యయనం చేసుందకు ముందుగా విద్యార్థులకు కోడింగ్ ఫౌండేషన్‌ను నిర్మిస్తారు. వారు గ్రూప్ ప్రాజెక్ట్‌లు, రియల్-వరల్డ్ కేస్ స్టడీస్ మరియు ఇంటర్న్‌షిప్‌లతో తమ అభ్యాసాన్ని మెరుగుపరుచుకుంటారు. ఇండస్ట్రీ మైక్రో-క్రెడెన్షియల్స్ ప్రోగ్రామ్‌లో అందిస్తారు. ఇవి ముందస్తు అభ్యాసంగా గుర్తించబడతాయి. విద్యార్థులు ఉద్యోగ సంబంధిత జ్ఞానాన్ని విస్తరించేందుకు వెసలుబాటు కల్పిస్తుంది. ‘‘ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆధునిక వర్క్‌ఫోర్స్‌లో అభివృద్ధి చెందడానికి అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను నేర్పుతుంది. ఏ రంగంలోనైనా సరికొత్త ఏఐ మరియు డేటా సైన్స్ టెక్నిక్‌లను ఎలా అమలు చేయాలో తెలుసుకుని వారు గ్రాడ్యుయేట్‌లు కావడంతో పాటు తమ కెరీర్‌లో విజయం సాధించేందుకు వాటిని ఏర్పరచుకుంటారు” అని ఐఐటి గౌహతి అఫిషియేటింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పరమేశ్వర్ కె. అయ్యర్ అన్నారు. గ్రాడ్యుయేట్లు భారతదేశంలో ఏఐ ఇంజనీర్, డేటా ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్ మరియు డేటా అనలిస్ట్‌లతో సహా 4,00,000 కన్నా ఎక్కువ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. విద్యార్థులు ఐఐటి గౌహతి నుంచి జాబ్ ప్లేస్‌మెంట్ సపోర్టును అందుకుంటారు మరియు కోర్సెరా నైపుణ్య-ఆధారిత రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్, కోర్సెరా హైరింగ్ సొల్యూషన్స్‌కు అందుబాటు పొందుతారు. ఐఐటి గౌహతి గ్రాడ్యుయేట్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్ స్యాచ్స్, ఎల్ అండ్ టి మరియు ఇంటెల్‌తో సహా ప్రముఖ కంపెనీలలో ఇప్పటికే ఉద్యోగాలు దక్కించుకున్నారు. ‘‘ఐఐటి గౌహతితో మా భాగస్వామ్యాన్ని విస్తరించడం మాకు గౌరవంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాల కోసం వారిని సిద్ధం చేసే భారతదేశంలోని అత్యుత్తమ సంస్థ నుంచి డిగ్రీని సంపాదించడానికి వీలు కల్పిస్తుంది’’ అని కోర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ మార్ని బేకర్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘‘ఏఐ ప్రపంచాన్ని మారుస్తోంది మరియు ఈ సాంకేతికతను ఉపయోగించగల నిపుణులు మాకు అవసరం. అడ్మిషన్లకు పలు మార్గాలతో, ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వారి భవిష్యత్తుపై పట్టు సాధించవచ్చు’’ అని వివరించారు. డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లో బీఎస్సీ (ఆనర్స్) కోసం జూలై 19, 2023 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు మరియు తరగతులు అక్టోబర్ 2023లో ప్రారంభం అవుతాయి. మరిన్ని వివరాలకు మరియు దరఖాస్తు చేసుకునేందుకు https://www.iitg.ac.in/acad/ని లేదా https://coursera.org/degrees/bachelor-of-science-data-science-ai-iitguwahati సందర్శించండి.
ఐఐటి గౌహతి గురించి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి 1994లో నెలకొల్పగా, 28 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం, ఇన్‌స్టిట్యూట్‌లో పదకొండు విభాగాలు, తొమ్మిది ఇంటర్ డిసిప్లినరీ అకడమిక్ సెంటర్‌లు, ప్రధాన ఇంజనీరింగ్, సైన్స్, హెల్త్‌కేర్, మేనేజ్‌మెంట్ మరియు హ్యుమానిటీస్ విభాగాల ఐదు పాఠశాలలను కలిగి ఉంది. ఇవి బీటెక్, బీడీఎస్, ఎంఏ, ఎండీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఎస్ (రీసర్చ్), ఎంబిఏ, పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులకు, 8,000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ సదుపాయాలను అందిస్తోంది. ఐఐటీ గౌహతి దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్ సంస్థలలో 7వ స్థానాన్ని నిలబెట్టుకుని, కేంద్ర విద్యా శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ప్రకటించిన ‘ఇండియా ర్యాంకింగ్స్ 2023’లో ‘ఓవరాల్’ మరియు ‘రీసెర్చ్’ విభాగాలలో కేటగిరీలలో 9వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐఐటి గౌహతి, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎస్‌డిజి 7 (స్థోమత మరియు క్లీన్ ఎనర్జీ)లో 6వ ర్యాంక్‌ను సాధించింది మరియు ఏర్పాటు చేసిన 50 ఏళ్ల లోపు ఉన్న టాప్ 100 ప్రపంచ విశ్వవిద్యాలయాలలో స్థానాన్ని దక్కించుకున్న భారతదేశంలోని ఏకైక విద్యాసంస్థ. లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఈ ర్యాంకును అందించగా, వివిధ అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో నేటికీ తన ఉన్నతమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఐఐటి గౌహతి ‘రీసర్చ్ సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 37వ ర్యాంక్‌ను పొందింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ఓవరాల్ 364 ర్యాంక్‌ను పొందింది. ఐఐటి గౌహతి పరిశోధన మరియు ఆవిష్కరణలు ముందంజలో ఉన్న ఇతర రంగాలైన జెనోమిక్స్, డెవలప్‌మెంటల్ బయాలజీ, హెల్త్ కేర్ మరియు బయోఇన్ఫర్మేటిక్స్ మరియు ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్‌లో క్లిష్టమైన సైన్స్ పరిశోధన కార్యక్రమాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.