ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఐఐటి ఒలంపియాడ్ తరగతుల ప్రారంభం

Commencement of IIT Olympiad Classes at Oxford Schoolనవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ శివారులోని గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో గురువారం ఐఐటీ ఒలంపియాడ్ తరగతులు నిర్వహించినారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటి నీట్ ఒలంపియాడ్ ఫౌండేషన్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు  మాట్లాడుతూ విద్యార్థుల్లో  బట్టి విధానాన్ని మానిపించి  విషయ పరిజ్ఞానాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో ఐఐటీ నీట్ ఒలంపియాడ్ శిక్షణ తరగతులు పాఠశాల స్థాయి నుండి అందించడం అవసరమని ఆయన అన్నారు .ఈ శిక్షణ తరగతులు వల్ల పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు ఆత్మస్థైర్యము పెరుగుతుందని లాజికల్ మరియు రీజనింగ్ విషయాల్లో నిష్ణాతులుగా తయారవుతారని. మెట్రోపాలిటన్ పట్టణాల్లో అందించే విద్యను ఆక్స్ఫర్డ్ పాఠశాలలో  అందించడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ ఐఐటి ఒలంపియాడ్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.