పీజీ, ఇంటిగ్రేటెడ్ పరీక్షలు ప్రారంభం

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ , అనుబంధ కళాశాలల పీజీ మొదటి సెమిస్టర్ ( ఎంఏ, /.ఎం. కాం / ఎం. ఎస్. డబ్ల్యూ / ఎం ఎస్సి/ ఎంబీఏ./ ఎంసీఏ), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల ( ఏ.పి.ఈ/ ఐ.పి.సిహెచ్ ఐఎఎం బీఏ/)7వ, సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమై య్యాయి. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం.యాదగిరి యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనంలోని పరీక్ష కేంద్రాన్నీ తనిఖీ చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్ లను ,ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల వద్దకు అనుమతించవద్దని పరీక్ష నిర్వాహకులకు సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో  రిజిస్ట్రార్ తో పాటు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ ఆర్ట్స్ అండ్ సైన్స్  కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ అరతి, పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ పాల్గొన్నారు.  ఈ పరీక్షలకు ఉదయం 1911 మంది విద్యార్థులకు 1820 మంది విద్యార్థులు హాజరయ్యారని 91 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంట చంద్రశేఖర్ తెలిపారు.