వడ్డెర కమ్యూనిటీ నిర్మాణ పనుల ప్రారంభం 

Commencement of construction works of Vaddera community– పాలడుగు వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
మంత్రి సీతక్క హామీ ఇచ్చిన ప్రకారంగా మండలంలోని చల్వాయి గ్రామంలో వడ్డెర కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ  ఎన్నికల ముందు చల్వాయి గ్రామంలోని వడ్డెర కుల సంఘానికి కమ్యూనిటీ భవనం నిర్మిస్తానని ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క  కుల సంఘ భవనాన్ని మంజూరు చేశారని, అలాగే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అన్నారు. సీతక్క  నేడు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా వెంటనే భవన నిర్మాణానికి పూజ కార్యక్రమాలు చేశామని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వడ్డెర కుల సంఘ భవనం మంజూరు చేసిన సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి, ప్రతి సమస్యను పరిష్కార దిశగా అడుగులు వేస్తూ, అసలు సిసలు ప్రజా నాయకురాలిగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న సీతక్కకి నా తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, మాజీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్, వడ్డెర కుల సంఘ సభ్యులు పిట్టల సమ్మయ్య, ఎల్లయ్య, శివరాత్రి బిక్షపతి, పిట్టల వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.