దళిత బంధు ప్రకటనపై సంబురాలు..

నవతెలంగాణ-బెజ్జంకి: ప్రజా ఆశీర్వాద సభలో మానకొండూరు నియోజకవర్గంలోని దళితులందరికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై మండలంలోని దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ మాట్లాడారు. దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు.