బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సంబురాలు..

నవతెలంగాణ-బెజ్జంకి:
మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందించే సంక్షేమ పథకాల బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై మండల బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు,బాణ సంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.