– పాలక మండలికి నోటిఫికేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పాలక మండలి నియామకానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్వూలు జారీ చేశారు. చైర్మెన్‌తో పాటు ఆరుగురు సభ్యులను ఎంపిక చేయనున్నుట్టు తెలిపారు. విద్యార్హతలు, ఇతర నిబంధనలకు డబ్ల్యూడీసీ. టీజీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన అభ్యర్థును ఇంటర్వూకు ఆహ్వానించనున్నట్టు తెలిపారు.