నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : వచ్చే రబీ సీజన్ (2024-25) గాను యాక్షన్ ప్లాన్ మీద సివిల్ సప్లై కమిషనర్ డి.ఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే వాన కాలం కు సంబంధించి సిద్ధంగా ఉండాలని, కావలసిన ఎక్విప్మెంట్ గురించి,కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి,రైస్ మిల్లుల క్యాపసిటీ గురించి, ప్యాడి క్లీనర్ ల గురించి, వంటి వాటి పై కూలంకషంగా సమీక్షించారు. ఖరీఫ్ (2024-25) మరియు రబీ (2023-24) సీజన్ లకు సంబంధించినటి వంటి CMR ను , FCI కు సంబంధించిన క్లెయిమ్స్ పై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి.యం సివిల్ సప్లై , డిసిఎస్ఓ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి పాల్గొన్నారు.