
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్. నిజామాబాద్ పట్టణ కేంద్రంలో గల ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను క్షుణ్ణంగా బుధవారం పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా పూలాంగ్ చౌరస్తా, నిఖిల్ సాయి చౌరస్తా, కోర్టు చౌరస్తా, బైపాస్ రోడ్డు చౌరస్తా, క్రిష్ణ మందిర్ చౌరస్తా మొదలగు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏ వైపు నుండి భారీ వాహనాలు వస్తుంటాయి, ఏ వైపు నుండి ఎక్కువగా వాహనాదారులు వస్తుంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ సమయాన్ని ఏ మొత్తంలో టైమ్ ను ఏర్పాటు చేయాలి అని క్షుణ్ణంగా పర్యవేక్షించి , తదుపరి వాటి నియంత్రణ కోసం తీసుకోవల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎ.సి.పి నారాయణ, ట్రాఫిక్ సి.ఐ వి.వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.