విధుల్లో నిబద్దత ఉద్యోగికి వ్యక్తిగత గౌరవం పెంచుతుంది: ఏడీ

Commitment to duties increases employee's personal dignity: AD– చదివిన కళాశాలలోనే బోధన చేయడం అరుదైన అవకాశం
– ప్రొఫెసర్ కేజీకే మూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యోగి లో విధులు పట్ల నిబద్దత,అంకిత భావం ఉన్న వారిపట్ల సమాజంలో వ్యక్తిగత గౌరవం పెంచుతుందని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్ అన్నారు. ఈ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి కార్యాలయంలో సాంకేతిక సహాయకులుగా బదిలీ అయిన డా.కె.గోపాలకృష్ణమూర్తి వీడ్కోలు సభను బుధవారం కళాశాల బోధనా సిబ్బంది కళాశాలలో ఏర్పాటు చేసారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ గోపాలకృష్ణ మూర్తి కళాశాలకు వెన్నుముక లాంటి వారని,ఆయనకు తన పనిపట్ల నిబద్ధత,పెద్దల పట్ల గౌరవం,కళాశాల అభివృద్ధికి తన శాయశక్తులా నిర్విరామంగా కృషి,కళాశాలలో ప్రతి ఒక్క విషయంపై ఆయనకున్న అవగాహణాశక్తి, చిత్తశుద్ది, ఇతరుల పట్ల ఆయనకున్న అభిమానం, కళాశాల సామాగ్రి అభివృద్ధికి ఆయన కృషి చిరస్మరణీయం అని కొనియాడారు. చదివిన కళాశాల లోనే సుదీర్ఘ కాలంగా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించి, ఇప్పుడు విశ్వవిద్యాలయం ఉపకులపతి కార్యాలయంలో సాంకేతిక సహాయకులుగా ఒక గౌరవనీయమైన, కీలకమైన, ఉన్నత స్థానంలోకి బదిలీ కావడం హర్షణీయం అన్నారు. అయ్యారు. గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ “చదివిన కళాశాల లోనే బోధన చేసే అవకాశం కలగడం అరుదైన అవకాశం అని” కళాశాలలో తన అనుభవాలను తోటి సిబ్బందితో పంచుకున్నారు. కళాశాల తో అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయన బోధనా సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించి, కానుకలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలిపారు. బోధనా సిబ్బంది ప్రొఫెసర్స్ ఐ.వి. శ్రీనివాసరెడ్డి,కె. నాగాంజలి, యస్.మధుసూధన్ రెడ్డి, రాంప్రసాద్, రెడ్డి ప్రియ, జంబమ్మ, రమేష్, కే.శిరీష, శ్రీలత, పావని, కృష్ణ తేజ, దీపక్ రెడ్డి, చరిత, పావని, పాల్గొన్నారు.