బుద్దదేవ్‌నకు లాల్ సలామ్ లాల్ సలామ్!
నిబద్ధ వీరునికి లాల్ సలామ్ లాల్ సలామ్!
మార్క్సిస్టు యోధవై ప్రజానేతవై
జన హృదయాల్లో నిలిచిన కామ్రేడ్ ||
కార్మిక కర్షక కష్టజీవుల
బాధలు తొలగగ పోరాడి
కమ్యూనిస్టుగా జీవితాంతమూ
అంకితమైన ఆశయ పథికుడా… ||
నిజాయితీకి నిలువెత్తు రూపమా
స్వార్థమెరుగని సమర గీతమా
నిరాడంబరత నీ ఆదర్శం
ప్రజాసేవకే నిత్యం అంకితం! ||
బంగ జనుల రంగభూమిలో
విప్లవ వీరుడవై ఎదిగావు
ఆటుపోటులను ఎదుర్కొని
ఉద్యమాలలో మెరిసావు! ||
అమరుడవై గుర్తుంటావు
ఆశయాలలో వెలుగుతుంటవూ
మీ త్యాగపు దారులలోనే
ఎర్రజెండ ఎగురుతుంటది! ||
– కె.ఆనందాచారి