నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధరణీ సమస్యల పరిష్కారంతో పాటు పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వూలు జారీ చేశారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఆడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) మెంబర్ కమిషనర్‌గా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, ప్రముఖ న్యాయవాది సునిల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ధరణీలో ఉన్న లోపాలు, వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈ కమిటీకి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు సహకరించాలని ఉత్తర్వూలో పేర్కొన్నారు.