నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఈనెల 12నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. నిహారిక కొణిదెల మాట్లాడుతూ,’మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్. నా ఇండిస్టీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షోతో స్టార్ట్ చేశాను. ఈ సినిమా ఈటీవీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. ఈనెల 12న ఈటీవి విన్‌లో మా సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్‌లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజారు చేశారో, ఈటీవీ విన్‌లో కూడా చూసి అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.