మేడిగడ్డపై విచారణకు కమిటీ

మేడిగడ్డపై విచారణకు కమిటీ– చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వం
– త్వరలో సభ్యుల నియామకం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు, పిల్లర్ల కుంగుబాటుపై ఎన్‌డిఎస్‌ఏ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ మాజీ చైర్మెన్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ చైర్మెన్‌గా జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఏ) కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈమేరకు ఆమోదం తెలిపారు. మరో నలుగురు సభ్యులను ఒకటి, రెండు రోజుల్లో నియమించనున్నారు.