వీఆర్‌ఏల సమస్యల అధ్యయనానికి కమిటీ

వీఆర్‌ఏల సమస్యల అధ్యయనానికి కమిటీ– వీలైనంత త్వరలో నివేదిక : రెవెన్యూ శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) నియామకానికి సంబంధించి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల క్రితం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వీఆర్‌ఏలకు ఇచ్చిన హమీ మేరకు సర్కార్‌ ముందడుగు వేసింది. వీఆర్‌ఏ నియామకం, ఇతర సమస్యల అధ్యయనానికి కమిటీ వేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీల్‌ మిట్టల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్‌ఏ కార్యదర్శి నేతృత్వంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీఆర్‌ఏ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసులు, చట్టపరిమితి, న్యాయవివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ వీఆర్‌ఏల అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.