నియంతలపైసామాన్యుడి పోరాటం

Commoners against dictators
fightవిజయ్ ఆంటోనీ ‘హిట్లర్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చెందూర్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా దీన్ని నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్‌ సంజయ్ కుమార్‌ నిర్మాతలు. ధన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
ట్రైన్‌ జర్నీ నేపథ్యంగా రూపొందించిన ఈ మోషన్‌ పోస్టర్‌ సినిమా పై క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది. ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే హిట్లర్‌. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీని త్వరలో పాన్‌ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో మేకర్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు.