– ప్రయివేటు, కార్పొరేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి
– పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, మెస్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి
నవతెలంగాణ- తాడ్వాయి
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వవిద్య ప్రమాణాలను నిర్వీర్యం చేస్తూ, ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచి పరుస్తుందని వాటికి నిరసనగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఉద్యమంలో ఇదే కేసీఆర్ శ్రీ చైతన్య నారాయణ సంబంధించిన కాలేజీలను స్కూళ్లను ప్రభుత్వ పరం చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసిఆర్ ఈరోజు మాత్రం వాటికి ఎర్ర తివాచి పరచడం సిగ్గుచేటన్నారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను ప్రభుత్వ పరం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్, మెస్, కాస్మోటిక్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను మన ఊరి మనబడి పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అధికారుల ప్రభుత్వ ఉద్యోగుల, ఎమ్మెల్యే, ఎంపీల ఎమ్మెల్సీల, మంత్రుల పిల్లలు చదివే విధంగా కామన్ స్కూల్ విద్యా విధానం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షపు నీటితో మునిగిపోతున్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల అన్నింటిని నూతన భవనాలు, మైదానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలొ పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, బివిఎం రాష్ట్ర కార్యదర్శి విటల్ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివప్రసాద్, బిడిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు సురేష్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు ముఖేష్ , కోశాధికారి శ్రీకాంత్, బివిఎమ్ జిల్లా నాయకులు అర్బజ్, బుల్లెట్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.