ఆటిజం అనేది చిన్న పిల్లల్లో వచ్చే ఒక దీర్ఘకాల మానసిక వ్యాధి. దీనిని న్యూరో డెవెలప్మెంటల్ డిజార్డర్ గా పరిగణిస్తారు. ఈ డిజార్డర్ వచ్చిన పిల్లల్లో మానసిక ఎదుగుదల చాలా తక్కువగా, నెమ్మదిగా ఉంటుంది. ఒక రకంగా దీన్ని మందబుద్ధిగా కూడా చెప్పవచ్చు.
ఆటిజం ఉన్న పిల్లలు ఎవరితో కలవకుండా తమ స్వంత ప్రపంచంలోనే ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితో కమ్యూనికెట్ అవ్వలేరు. తమ వయసు పిల్లలతో కూడా కలిసి ఆడుకోవడానికి ఎటువంటి ఆసక్తి కనబరచరు. ఒకటికి నాలుగుసార్లు పిలిస్తే కానీ మనం వైపు చూడారు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోలేరు.
ప్రస్తుత కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తుంది. ఆటిజం లక్షణాలను మూడు సంవత్సరాల వయస్సుకు ముందే గుర్తించవచ్చు. కొందరి పిల్లల్లో ఆటిజంతో పాటు మూర్ఛవ్యాధి, హైపరాక్టివిటి, మేధో వైకల్యం, బాషా, వినికిడి, చూపు సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి.
భారత పిడియాట్రిక్ జర్నల్ జరిపిన సర్వే ప్రకారం ప్రతి 68 మందిలో ఒకరికి ఆటిజం వస్తుంది. మగపిల్లల్లో ఆడపిల్లల కంటే ఎక్కువగా 3:1 ప్రకారం ఉంటుంది.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సర్వే ప్రకారం సుమారు 1 కోటి 80 లక్షలకు పైగా ఆటిజం బాధితులున్నారు.
ఆటిజం లక్షణాలు:
– ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటం.
– కల్లల్లోకి చూసి మాట్లాడకపోవడం.
– తమలో తామే నవ్వుకోవడం.
– తనలో తానే మాట్లాడుకోవడం.
– ఎదుటి వారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం.
– పాదాలు పైకెత్తి నడవడం.
– విన్న దాన్ని పదే పదే పలకడం.
– ప్రశ్నకు ప్రశ్ననే సమాధానంగా చెప్పడం.
– తమ చుట్టే తాము తిరగడం.
– వయసుకు తగిన విధంగా ప్రవర్తించకపోవడం.
– చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయడం.
– పేరుతో పిలుస్తే పలకకపోవడం.
– మాటలు సరిగా రాకపోవడం.
– ఇతరుల హావభావాలను అర్థం చేసుకోలేకపోవడం.
– చుట్టుతా ప్రపంచంతో సంబంధం లేనట్లు వ్యవహరించడం.
– మనం చెప్పే మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం.
– సోషల్ స్మైల్ లేకపోవడం.
– కొత్త పరిసరాలను ఇష్టపడక పోవడం.
– కాళ్ళు, చేతులను ఎప్పుడూ ఊపుతూ ఉండటం.
– కొన్ని శబ్దాలు వింటుంటే భయపడటం, ఒకచోట కుదురుగా కూర్చోలేకపోవడం.
– ఏదైనా వస్తువును ముక్కు లేదా నోటి దగ్గర పెట్టుకుని పరీక్షించడం.
– వస్తువులను క్రమపద్ధతిలో ఉంచడం.
– అసాధారణమైన శబ్దాలు చేయడం.
ఆటిజం కారణాలు: పరిశోధనల్లో ఆటిజం రావడానికి ఖచ్చితమైన ప్రధాన కారణాలను ఇంతవరకు ఎటువంటి కూడా రుజువు చేయలేకపోయినా చాలామందిపై జరిపిన పరిశోధనల ద్వారా కొన్ని కారకాలను తెలుపుతున్నాయి.
– జన్యు సంబంధిత సమస్యలు. క మేనరికపు వివాహం.
– పర్యావరణ కాలుష్యం. క అధిక రసాయనాలతో పండించిన ఆహారం.
– లేటు వయస్సులో పిల్లలను కనడం.
– పిల్లలు పుట్టడానికి తీసుకునే ఇన్ఫెర్టిలిటీ చికిత్స.
– తల్లికి ఏదైనా దీర్ఘకాల మానసిక మానసిక సమస్య, ఒత్తిడి, డిప్రెషన్ ఉండటం.
– గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అందకపోవడం.
– గర్భంతో ఉన్న తల్లిలో విటమిన్ డి, ఫొలిక్ ఆమ్లం లోపించడం.
– నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం.
– గర్భధారణ సమయంలో రక్తస్రావం
వంశపారంపర్యత: ఆటిజంతో మొదట పుట్టిన బిడ్డ తర్వాత పుట్టబోయే రెండో బిడ్డకు కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జన్యు సంబంధిత పరీక్షల ద్వారా నిర్ధారించుకుని పుట్టబోయే బిడ్డకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
సైకాలజిస్ట్ స్వీయ పరిశీలన, తల్లిదండ్రుల నుంచి తీసుకునే సమాచారం ద్వారా, వారి తెలివితేటలను మరికొన్ని పరీక్షల ద్వారా ఆటిజం యొక్క తీవ్రతతో వారి మేధాస్సును కనుగొని మరికొందరి థెరపిస్ట్ల సహకారంతో వారికి కావాల్సిన చికిత్స అందించడం జరుగుతుంది.
చికిత్స: ఆటిజం సమస్యకు ఇప్పటివరకు ఎటువంటి సంపూర్ణ నివారణ, చికిత్స అందుబాటులో లేదు కానీ ఆ సమస్య తీవ్రతను బట్టి వారిలో కొంత మార్పు తీసుకురావచ్చు. ఆటిజం తగ్గించడానికి ఎటువంటి మెడిసిన్ అందుబాటులో లేదు.
బిహేవియర్ థెరపీ: పిల్లలు నేర్చుకున్న చెడు ప్రవర్తనను తగ్గించి, మంచి ప్రవర్తన, ఏకాగ్రత, కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలైన నైపుణ్యాలను నేర్పిస్తారు. పిల్లలు తమ ఆలోచనలను వ్యక్తపరచేలా, ఎదుటి వారి మాటలను అర్థం చేసుకుని, వారికి తగిన విధంగా సమాధానం తేలియజేయగలిగే కమ్యునికేషన్ నైపుణ్యాలను నేర్పిస్తారు.
స్పిచ్ థెరపీ: ఈ విభాగంలో బాషా సంబంధిత ఉచ్ఛారణ, ప్రతిధ్వనులు, పద, వాక్య నిర్మాణం వంటివి నేర్చుకుంటారు.
అక్యూపెసనల్ థెరపీ: స్వచ్చందంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా వస్తువులను సరిగా పట్టుకోవడం, నడవడం, పరుగెత్తడం వంటి సెన్సరీ, మోటార్ స్కిల్స్ నేర్పిస్తారు.
స్పెషల్ ఎడ్యుకేషన్: నిపుణులైన ఉపాధ్యాయులచే ప్రత్యేకమైన బోధన పద్ధతులలో జీవించడానికి కావలసిన అన్ని రకాలైన విద్యను అందిస్తారు.
ఓకెషనల్ ట్రెయినింగ్: స్వచ్చందంగా జీవించడానికి, వత్తి పరమైన విధులు నిర్వహించేందుకు కావాల్సిన కొన్ని నైపుణ్యాలు నేర్చుకుంటారు.
మీ పిల్లల్లో ఆటిజంతో పాటు ఇతర మానసిక, బిహేవియర్ సమస్యలు ఉంటే వెంటనే సైకాలజిస్టుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
(ఏప్రిల్ 2 ఆటిజం అంతర్జాతీయ అవగాహన దినోత్సవం సందర్భంగా…)
– హరిష్ ఆజాద్ (సైకాలజిస్ట్)
7382173741