కమ్యూనిస్టులను గెలిపించాలి

– సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బొంతల చంద్రారెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
నిరంతరం ప్రజల కోసం పని చేసే కమ్యూనిస్టు నాయకులు అసెంబ్లీ లో ఉండే విధంగా ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు బొంతల చంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో బుధవారం జరిగిన సిపిఎం మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు సకాలంలో రుణమాఫీ చేసి వారిని ఆదుకోవడంలో, రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో కెసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పదవుల కోసం పార్టీ లు మార్చే అవకాశ వాద అభ్యర్థుల విషయంలో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌ మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన నకిరేకల్‌ సిపిఎం అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు నామినేషన్‌ వేసే కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, అభిమానులు, వివిధ రంగాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్‌, జిట్ట సరోజ, రూరల్‌ మండల కార్యదర్శి అరూరి శ్రీను, నాయకులు శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహా, లడే రాములు, గుడిసె లక్ష్మినారాయణ, కత్తుల లింగస్వామి పాల్గొన్నారు.