నేల, నీటి సంరక్షణతో సమాజాభివృద్ధి

– ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ – పెద్దవంగర:
నేల నీటి సంరక్షణతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం నేల రక్షణపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ..నేల చెడును అరికట్టాలని సూచించారు. పరిమితికి మించిన ఎరువుల వినియోగంతో నేలలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. నేల చెడును అరికట్టకపోతే భవిష్యత్‌ తరాలకు పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేల చెడును సమర్థవంతంగా అరికడితేనే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. పంటల సాగు సరళిని, సేంద్రియ ఎరువుల వినియోగం, సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. భూసార పరీక్షలు చేపడుతూ రైతులు దానికనుగుణంగా పంటల సాగు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, టకీం పాషా, అంజయ్య, యాకయ్య, వెంకన్న, షౌకత్ అలీ, విజయ్ కుమార్, గౌరీ శంకర్ సువర్ణ, కరుణ, హైమ తదితరులు పాల్గొన్నారు.