ఎస్సైని కలిసిన ప్రజాసంఘాల నాయకులు

నవతెలంగాణ-మంగపేట : మంగపేట ఎస్సైగా ఇటీవల బాద్యతలు తీసుకున్న రవికుమార్ ను మండలంలోని పలు ప్రజాసంఘాల నాయకులు మంగళవారం స్టేషన్ లో కలిసి పుష్ప గుచ్చాలు అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని జ్వాలా యూత్, ట్రస్ట్, తెలంగాణ మాల మహానాడుకు చెందిన ప్రజా సంఘాల నాయకులు కలిసి మండలంలోని పరిస్థితులపై ఎస్సైతో చర్చించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి, ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్, కస్ప ముకుందం, కార్యదర్శి ఆత్మకూరి సతీష్, గౌరవ సలహదారులు చాద మల్లయ్య, సయ్యద్ బాబా, గగ్గూరి మహేష్, సంజయ్, వినోద్, రాజేష్, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీనువాస్, మేడిద సతీష్ గౌడ్, పూజారి రాజు, కాపుల రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.