మహాజన సభకు సంఘం వాటాదారులు భారీగా తరలి రావాలి

Community stakeholders should flock to the Mahajana Sabha in large numbers– సభ్యత్వ రసీదు అందజేత లో చైర్మన్ రైతులకు పిలుపు

– సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు తీర్మానిద్దాం
నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ ద్వితీయ మహాసభ ఈనెల 12న గురువారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించే సభకు వాటాదారులైన రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని సంఘం చైర్మన్ చాట్లవార్ గోపాల్ రైతులకు సభ్యత్వ రసీదులు అందజేస్తూ పిలుపునిచ్చారు. ద్వితీయ మహాసభలో ప్రత్యేకంగా 10 ఏజెండా అంశాలు ఆమోదించుకోవలసి ఉంటుందని, వీటిలో ముఖ్యంగా ప్రభుత్వం మద్దతు ధర సోయా పంట కొనుగోలు కేంద్రాన్ని రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ మద్నూర్ ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడానికి ప్రత్యేకంగా తీర్మానించుకోవడం జరుగుతుందని ఇట్టి సమావేశానికి వాటాదారులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వాటాదారులైన రైతులకు కోరారు. ఇట్టి మహాజన సభకు ముఖ్య అతిథులుగా వివిధ శాఖ అధికారులైన1, బ్రాంచ్ మేనేజర్ నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ హైదరాబాద్2, రాజు సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ మద్నూర్ మండల్3, డాక్టర్ సుజాత మేడం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జుక్కల్4, శివాని మేడం సెంట్రల్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కామారెడ్డి5, డాక్టర్ సంతోష్ సార్ వెటర్నరీ ఆఫీసర్ మద్నూర్6, అరవింద్ సార్ ఏ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మద్నూర్7, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆఫీసర్ మద్నూర్8, తోమస్ సార్ కోఆర్డినేటర్ నమ్కోన్స్ నిజామాబాద్ అండ్ కామారెడ్డి9, యూసుఫ్ సార్ కోఆర్డినేటర్ నబ్ కోన్స్ కామారెడ్డి ఏరియా, ఈ విధంగా మొత్తం 9 మంది ఉన్నత అధికారులు ఈ రెండవ మహాజన సభకు హాజరవుతున్న సందర్భంగా వాటాదారులు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని సంఘం చైర్మన్ గోపాల్ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.