మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఓసిపికి డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు, భూములకు వెంటనే పరిహారం,పునరావాసం కల్పించాలని మాజీ జెఫ్పిటిసి గొనె శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని,జెన్కో అధికారులను డిమాండ్ చేశారు.శుక్రవారం భూనిర్వాసితులతో గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్ మఖ్యమంత్రిగా,మంథని ఎమ్మెల్యేగా పుట్ట మాధుకర్ ఉన్నప్పుడు జెన్కో సిఎండి వద్దకు నిర్వాసితులను తీసుకెళ్లి పరిహారం ఇప్పించారని గుర్తు చేశారు.2024 ప్ఫిబ్రవరి నెలలో మాజీ ఎంపిటిసి రావుల కల్పనమొగిలి ఆధ్వర్యంలో నిర్వాసితుల పరిహారం వెంటనే చెల్లించాలని శాంతియుత ఆందోళన కార్యక్రమం చేపడితే కొయ్యురు పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా తెలిపారు. జెన్కో సిఈ సిద్దయ్య జున్ నెలలో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.కానీ ఇంతవరకు పరిహారం ఊసే లేదన్నారు. ఇప్పటికైనా జెన్కో అధికారులు నిర్వాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలొ మాజీ ఎపిటిసి రావుల కల్పన మొగిలి,భూనిర్వాసితులు అక్కపాక సమ్మయ్య, తాండ్ర మల్లేష్, అర్ని సత్యనారాయణ,బొబ్బిలి రమేశ్ ,బిఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రావు, కామ బాపు దేవురనేని రాజేశ్వర్రావు పాల్గొన్నారు.