
నవతెలంగాణ – తొగుట
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కురిసిన గాలివాన మూలంగా నష్టపోయిన వెంకట్రావుపేట కు చెందిన బెజ్జనమైన కనకయ్య, జంగపల్లి నర్సిం హులుకు చెందిన మొక్కజొన్న చెలును పరిశీలిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట చేతికి వొచ్చే సమయంలో అకాల గాలివాన మూలంగా మొక్కజొన్న చేలు పడిపోవడంతో తీరని నష్టం జరిగిందన్నారు. మామిడి తోటలలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంట చేతికి వొచ్చే సమయంలో పంట నష్టం మూలంగా తీరని నష్టం వాటిల్లిందన్నారు. యాసంగి పంట చివరి దశకు వొస్తున్న సమయంలో ప్రభుత్వం రైతు బంధు డబ్బులు పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మండల వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 10 వేల నష్టపరిహారం అందించి ఆదుకోవా లని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరి శీలించిన వారిలో రైతు బంధు మాజీ అధ్యక్షుడు బండారి స్వామిగౌడ్, రైతులు తదితరులు ఉన్నారు.