
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు తూర్పు రాజు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు మండలాల్లోని వాగులు వంకల పక్కన ఉన్నటువంటి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి భారీగా ఇసుక మేటలు వేసాయి ఈ రకంగా రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడం జరిగింది కావున పాలకులు అధికార యంత్రాంగం స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకుపంట నష్టపరిహారం ఇచ్చే విధంగా నివేదికలు తయారుచేసి పేద రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఆయన అన్నారు