– తుమ్మల వెంకటరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
వరుసగా కురుస్తున్న అకాల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కోటగడ్డ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మల వెంకట్ రెడ్డి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మాట్లాడుతూ వరి పొలాలు మొత్తం పడిపోయి చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బ తిన్నదని ప్రతిరోజు భారీగా కురుస్తున్న వర్షాలకు పంటలు చేతికొచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.30000 రూపాయలు ఖర్చుపెట్టి కౌలు రైతులకు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించాలని ఎకరాకు రూ.20000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అంతేకాకుండా వర్షంతో తడిసిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మిల్లర్స్ ఇది అవకాశం తీసుకొని రైతులు నష్టపరుస్తున్నారని పేర్కొన్నారు .వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారంఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల సమీకరించి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో తీగల ఆదిరెడ్డి రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు అఖిలపక్ష రైతు సంఘం మండల అధ్యక్షుడు గొల్లల నర్సిరెడ్డి ,రైతులు కుంచాల తిరుపతిరెడ్డి, బైరి కొండల్ రెడ్డి, వేములవాడ సాంబశివరావు ,ఆలేటి తిరుపతి రెడ్డి ,తుమ్మల సుధాకర్ రెడ్డి ,ఏనుగ శేఖర్ రెడ్డి ,మట్ట సోమిరెడ్డి తది తర రైతులు పాల్గొన్నారు.