జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు

– ముఖ్యఅతిథిగా హాజరైన డిఈఓ
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్  యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో జిల్లాలోని విద్యార్థులకు స్పెల్ విజార్డ్, డ్రామా పోటీలను వెన్నెల కాలేజీలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఈవో కె నారాయణరెడ్డి హాజరై,  మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ను అభివృద్ధి చేయడానికి, వారిలో కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎల్టా   యాదాద్రి భువనగిరి జిల్లా టీంను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎన్  కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం మోహన్ రావ్, సెక్టోరియల్ అధికారి పి లింగా రెడ్డి, కోశాధికారి బి  ప్రభాకర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబెర్స్ బి.అశోక్ రెడ్డి, డా ఎ వనజ, కార్యక్రమ ఇన్చార్జిలు మెతుకు సైదులు, ఎం డి మక్సూద్ అలీ, కె  రమేష్ మండల ఎల్టా కన్వీనర్స్, టీచర్స్ , విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి డ్రామా పోటీలలో మొదటి బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ బస్వాపురం, టీఎస్ ఎంఎస్ బొమ్మలరామారం, కేజీబీవీ అడ్డగూడూర్ రెసిడెన్షియల్ పాఠశాలు విద్యార్థులు విజేతలుగా నిలిచారు.  జిల్లాస్థాయి స్పెల్ విజార్డ్ పోటీలలో మొదటి బహుమతి బి సాత్విక జడ్పిహెచ్ఎస్ వెల్లంకి,  ద్వితీయ బహుమతి జె చందన జడ్పిహెచ్ఎస్ జలాల్పూర్, రెసిడెన్షియల్ పాఠశాలలో మొదటి బహుమతి టీ ఎస్ రెసిడెన్షియల్ అడ్డగూడూరు, ద్వితీయ బహుమతి
టి వర్షిత కేజీబీవీ గుండాల విద్యార్థులు విజేతలుగా నిలిచినట్లు తెలిపారు.