– మండలంలో వేడెక్కిన రాజకీయ సమీకరణాలు
– నిన్నోక పార్టీలో..నేడోక పార్టీలో..రేపు..?
నవతెలంగాణ-బెజ్జంకి : మండలంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలో అయా పార్టీల శ్రేణుల చేరికలు పోటాపోటిగా కొనసాగుతున్నాయి.దీంతో మండలంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కి రోజురోజుకు పరిస్థితులు ఆసక్తిరెపుతున్నాయి.అయా పార్టీల శ్రేణులు నిన్నోక పార్టీలో చేరడం..నేడోక పార్టీలో చేరడం..రేపు మరో పార్టీలో చేరకుండా ఉంటారా? అనే సందేహలు అయా రాజకీయ పార్టీల నాయకుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని వినికిడి.ఇటువంటి సంఘటన మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో జరగడంతో పలువురు నివ్వెరపోతున్నారు. మండలంలోని ఒక గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు అదివారం ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.సోమవారం మండలంలోని ఒక గ్రామంలో గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యే రసమయి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒక్కరోజులోనే పలువురు పార్టీ కండువాలను మార్చుకున్న వైనంతో అయా రాజకీయ పార్టీల నాయకుల్లో అందోళన మొదలైందని పలువురు చర్చించుకుంటున్నారు.రోజుకో పార్టీలో చేరుతున్న వారిపై అయా రాజకీయ నాయకులు పునరాలోచనలో పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అభ్యర్థుల ఒత్తిడిల మేరకు పార్టీలో చేర్చుకోవడం వరకే ఆలోచించి మేప్పుపోందుతున్న నాయకులు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కాపాడుకొవాల్సిన పరిస్థితి నెలకొందని బాహటంగానే పలువురు ఆరోపిస్తున్నారు. పార్టీలో పలువురిని చేర్చుకోవడం ఒక ఎత్తయితే..వారిని రేపు మరో పార్టీలోకి వేళ్లి కండువాలు మార్చుకోకుండా కంటికి రెప్పల కాపాడుకోవడం అయా పార్టీల నాయకులకు తలకు మించిన భారంగా మారుతోందనే అపోహలు వినిపిస్తున్నాయి.ఎదిఎమైనా శాసనసభ ఎన్నికలు మండలంలోని అయా పార్టీల నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.దీంతో అయా పార్టీల్లో జోరుగా సాగుతున్న చేరికలు మండలంలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.