నీటి ఎద్దడి ఉంటే ఫిర్యాదు చేయండి

– సరఫరాలో తేడా రాకుండా టోల్‌ ఫ్రీ ఏర్పాటు
– మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌
నవతెలంగాణ-గండిపేట్‌
వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, సరఫరాలో తేడా రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ అన్నారు. మంగళవా రం ఆయన మాట్లాడారు.. మణికొండ మున్సిపాలి టీలో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుం టామన్నారు. సమ స్య ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాల న్నారు. సరఫరా చేసేందుకు మున్సిపా లిటీలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. నీటి ఎద్దడి విషయంలో మానిటర్‌ చేసేందుకు ఫిర్యాదుదారులకు ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య ఉన్న వెంటనే ఈ టోల్‌ ఫ్రీ నంబర్లకు 155313, 1800-599-7575 సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని మణికొండ మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.