నవతెలంగాణ-సంగారెడ్డి
సైబర్ నేరాలకు గురైతే.. వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ఎం.రమణ కుమార్ తెలిపా రు. మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్‌లో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహిం చారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో (అండర్ ఇన్వెస్టిగేషన్) ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నేరస్తులను న్యాయస్తానం ముందు హాజరు పరచాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ, కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాల న్నారు. నేరస్థలాన్ని సందర్శించినప్పుడు నేర స్థల చిత్రాలు డిజిటల్ కెమెరాలో తీయించాలని, ఆ ఫోటోగ్రఫీ నేరవిచారణకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ చూపాలని, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించి.. తగు ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల న్నారు. నేషనల్ హైవేలకు కలిసే అప్రోచ్ రోడ్లపై స్పీడ్ బ్రెకర్స్ వేయించడం, హైవే రోడ్డు వ్యూ క్లియర్ లేకుండా అప్రోచ్ రోడ్లకు అడ్డుగా వున్న చెట్లను, పొదలను తొలగించే విధంగా చూడాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే గ్రామాల్లో అవగాహన కార్య కమాలు నిర్వహించాలన్నారు. మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి తో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూ డదని, అలాంటి పక్షంలో తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతా రన్నారు. గంజాయి అక్రమ సాగు లేదా సరఫర పై ఉక్కు పాదం మోపాలని, ఎవరైనా గంజాయిని సాగు లేదా సరప ˜రా, నిల్వ చేసినా ఆ వ్యక్తులపై చట్టరిత్య తగు చర్య తీసుకో వాలని, రిపిటేడ్ అఫెండర్స్ పై పిడియాక్ట్ నమోదు చేయా లన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, డీజిల్, పెట్రోల్ రవాణాలను అరికట్టాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వర్టికల్ పనీతిరులో మెరుగైన ప్రదర్శన కనబరిచి, జిల్లాను ముందు వరుసలో నిలపాలని, ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. ఆయా వర్టికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి, అధికారులకు రివార్డులు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నేరాల అదుపునకు తమతమ సబ్-డివిజన్ లలో కమ్యూ నిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని, దవపత్రాలు లేని వాహనాలను, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని డీఎస్పీలకు సూచించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్, జహీరాబాద్ డీఎస్పీ రఘు, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, పటాన్‌చెరు డీఎస్పీ పురుషోత్తం, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ, ఇన్‌స్పెక్టర్ బి.రమేష్, ఎస్‌బి. ఇన్‌స్పెక్టర్ శివలింగం, జిల్లా సిఐలు మరియు ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.