నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులలో ( స్కూల్ అసిస్టెంట్) జరిగిన అవినీతి, అక్రమాలు జరిగాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఈ విషయమై డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం. సోమయ్య ,టి. లింగారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం బాలయ్య, కె. ఒమాజీ, హైదరాబాదులో కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (పాఠశాల విద్య) దేవసేనని కలిసి ఫిర్యాదు చేశారు.