పాడైన గులాబ్ జామున్ వడ్డిస్తున్నారంటూ ఫిర్యాదు..

Complaint about serving spoiled gulab jamun..నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
పాడైపోయిన స్వీట్లు అమ్ముతున్నా రని ఓ హోటల్ ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన ఘటన సుల్తాన్ బజార్  పరిధిలో చోటు చేసు కుంది. ఇన్ స్పెక్టర్ శ్రీనివాసాచారీ వివరాల ప్రకారం… జీహెచ్ఎంసీ సర్కిల్ -16లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పని చేస్తున్న బి.వి. ఎస్. పేర్రాజు మరో అధికారితో కలిసి సోమవారం కాచిగూడ చౌరస్తాలోని స్వీకార్ హోటల్ కు వచ్చారు. రెండు గులాబ్ జామూన్ తెప్పించుకోగా అవి పులుపుపట్టి పాడైపోయి ఉండటంతో సిబ్బంది దృష్టికి తీసుకువె ళ్లాడు. కొన్ని రోజుల క్రితం తయారు చేసిన స్వీట్లు ఎలా తింటారని నిలదీయడంతో హోటల్ మేనేజర్, సిబ్బందితో వాగ్వాదం తలెత్తింది. దీంతో పేర్రాజు జీహెచ్ఎంసీ హెల్త్ ఆఫీసర్ కు సమాచారం అందించడంతో పాటు ఫ్రిడ్జిలో ఉన్న 12 గులాబ్ జామూలను తీసుకుని స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు అప్ప గించి నిర్వాహకులపై చర్యలు తీసు కోవాలని ఫిర్యాదు చేశాడు. వీటిని మల్కాజ్గిరి ల్యాబ్ కు పంపించినట్టు మంగళవారం సీఐ తెలిపారు